సత్యము యొక్క వెలుగులో – గ్రాలుసందేశమును సంపుటము I
జర్మనీ: 1-3 వ్యాపార రోజుల ఇతర దేశాలు: 5-30 పని రోజులు
„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం యొక్క మూడు సంపుటాలలో మొత్తం 168 ఉపన్యాసాలు ఉన్నాయి. అవి వాటి వరుసక్రమంలో విషయాన్ని క్రమంగా విస్తరిస్తూ సమస్త సృష్టి యొక్క సంపూర్ణ చిత్రాన్ని అందిస్తాయి.
ఈ గ్రంథంలో పొందుపరచబడిన ఉపన్యాసాలు 1923 నుండి 1938 సంవత్సరాల మధ్యలో వ్రాయబడినా, నేటివరకు అవి తమ అర్థాన్ని కోల్పోలేదు. అవి సృష్టి శాసనాల ఆధారంగా ఒక సమగ్రమైన విశ్వవివరణను అందిస్తాయి. ఆ వివరణ పాఠకునికి, జీవితంలోని మర్మమైయున్న అవినాభావ సంబంధాలను గుర్తించునట్లు చేస్తుంది మరియు తద్వారా విలువైన జీవితసహాయాలను అందిస్తుంది.
„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం ముఖ్యంగా ఎందువల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం
పొందిందంటే, అది మానవాళి యొక్క గొప్ప ప్రశ్నలకు నిస్సంశయమైన సమాధానాలను అందిస్తుంది, ఉదాహరణకు జీవితం యొక్క ఉద్దేశం గురించి, ప్రారబ్ధంలో న్యాయత గురించి లేక మరణం తరువాత జీవితం గురించి, ఇత్యాది. ఇంతవరకు అది 20 భాషలలోనికి అనువదించబడింది మరియు 90 దేశాలలో పొందబడగలదు.
పాఠకునికి నిజమైన జీవితాన్ని చేరువగా తెచ్చుట, అతని వ్యక్తిత్వ అభివృద్ధికి విలువైన ప్రేరణలను ఇచ్చుట మరియు అతన్ని దేవునిగుర్తింపును తనలో కలిగియున్న గుర్తింపుమార్గంపై నడిపించుట రచయిత యొక్క ఒక ఉద్దేశమైయుండింది. „సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథంలో పొందుపరచబడిన ఉపన్యాసాలు ఆ ప్రక్రియలో ఒక „దీపము మరియు దండమువలే“ ఉపయోగపడవలెను, మతపరమైన ఆలోచనతో లేక మనిషి యొక్క మతంతో సంబంధంలేకుండా. అబ్ద్-రు-షిన్ ఒక మతాన్ని కాని ఒక తెగను కాని లేక మతసంఘాన్ని కాని స్థాపించగోరలేదు.
„సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథంలోని వివరణలు సరలమైన, అర్థమయ్యే, సృష్టి శాసనాలను తమ ఆధారంగా కలిగియున్నాయి. అవి బాహ్యలోకంలో, అదే విధంగా జీవాత్మ యొక్క అంతరంగిక జీవితంలో పనిచేస్తాయి. ఆ వివరణలు విలక్షణమైన మానవ అనుభవాలను సంభోదిస్తాయి, బలాలను మరియు బలహీనతలను చూపుతాయి మరియు మర్మంగావున్న లోటుపాట్లను, అంతేకాక అనుదినజీవితం ఆత్మీయ అభివృద్ధి కొరకు అందించే చాలా అవకాశాలను సూచిస్తాయి. పాఠకుడు దానితో, ఆ ఉపన్యాసాలలోని విషయాన్ని తన స్వంత జీవితంలో తిరిగి కనుగొనుటకు మరియు దానిని సత్యమైనదానిగా గుర్తించుటకు అవకాశాన్ని కలిగియుంటాడు. ఆ విధంగా, ఆత్మీయమైన, అంతఃకరణానుభూతులతోకూడిన అనుభవాలు, వస్తుగత-తార్కిక నిగమనములతోపాటు ఒక సమగ్రమైన, పూర్ణరూపాత్మకమైన లోకచిత్రంగా ఏర్పడగలవు. దానిలో విజ్ఞానశాస్త్ర సంబంధమైన మరియు మతసంబంధమైన సత్యాన్వేషణకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.
„సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథము ఖచ్చితంగా సర్వసాధారణం కాని „గ్రాలుసందేశము“ అనే ఉపశీర్షికను కలిగియిన్నది. „గ్రాలు“ అనే పదంతో మనుష్యులు నేడు తరచుగా పురాణ కథల ద్వారా, ఐతిహ్యముల ద్వారా మరి ముఖ్యంగా కళ యొక్క రచనల ద్వారా సంక్రమించిన కాంక్ష-చిత్రాలు మరియు దర్శనములతో జోడిస్తారు. ఈ సంక్రమణలు వాస్తవంగా ఉనికిలోవున్న దానిని ధృవీకరిస్తాయని అబ్ద్-రు-షిన్ వివరిస్తాడు. అది, సమస్త సృష్టి ఉనికిలో కొనసాగుటకు మరియు దాని నిర్వహణకు అత్యంత ప్రధానమైనది. అదే సమయంలో „సందేశము“ అనే పదము, ఉపన్యాసాల ద్వారా బోధించబడే జ్ఞానం యొక్క ప్రత్యేకమైన, ఉన్నతమైన మూలాన్ని సూచిస్తుంది.
నిజానికి „సత్యము యొక్క వెలుగులో“ అనే ఈ గ్రంథం చూపే మార్గం సంపూర్ణంగా సులువైనది. దానికి గుప్తమైన దానితో కాని లేక అటువంటి దాని గుప్తవైఖరితో కాని ఎటువంటి సంబంధం లేదు. అయితే అది, అసలైన క్రీస్తు బోధవలే గణనీయమైన అవశ్యాభ్యర్థనలను పాఠకుని ఎదుట ఉంచుతుంది. కాగా కేవలం స్వంత, నిశ్పక్షపాతమైన, వస్తుగతమైన ఆలోచనాసరళియే కాక అతి ముఖ్యంగా „మంచి కొరకు దృఢమైన సంకల్పం“ ప్రోత్సాహించ బడవలెను. తన స్వంత విషయంలో మరియు తన పొరుగువాని సేవలో మనిషి చేసే ఈ కృషి అతన్ని ఆత్మీయ అభివృద్ధికి నడిపించగలదు.
గ్రాలుసందేశము సవివరమైన సమాధానాలు అందించే ముఖ్యమైన చాలా విషయాలలో కొన్ని ఇక్కడ పేర్కొనబడ్డాయి:
• బాధ్యత మరియు ప్రారబ్ధము/కర్మ
• మరణము మరియు పునరావృతమయ్యే భూలోక జీవితాలు/పునర్జన్మ
• ఆదిపాపము మరియు వారసత్వ పాపము
• ఈవలి- మరియు ఆవలిలోకాల సంయుక్త దర్శనము
• దేవుని ప్రేమ మరియు కృప
• శరీరము, జీవాత్మ మరియు ఆత్మ
• దైవకుమారుడు మరియు మనుష్యకుమారుడు
మార్గదర్శనార్థము!
కండ్లగంతలు తొలుగుతాయి మరియు నమ్మకము నిర్ధారణ అవుతుంది. నిర్ధారణలో మాత్రమే విడుదల మరియు విమోచన ఉన్నాయి!
మనస్ఫూర్తిగా అన్వేషించుచున్న వారితో మాత్రమే నేను మాత్లాడుతున్నాను. ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా పరీక్షించుటకు వారు తప్పక ఆసక్తులు మరియు సమర్థులైయుండవలెను! మతాభివేశులు మరియు మొండి మూర్ఖాభిమానులు దీనికి దూరంగా ఉండగలరు; ఎందుకంటే వారు సత్యానికి హానికరులు. ద్వేషపూరితులు, పక్షపాతులైతే ఈ వాక్యంలోనే తమ తీర్పును పొందవలెను.
ఈ సందేశము తమయందు ఇంకా సత్యపుమిణుగురును మరియు నిజంగా మనిషిగా ఉండుటకు అభిలాషను కలిగియున్నవారిని మాత్రమే తాకుతుంది. వారందరికీ అది దీపము మరియు దండము కూడా అవుతుంది. అది వారిని ప్రస్తుత సమస్త అయోమయపు అస్తవ్యస్తతనుండి నేరుగా బయటకు నడిపిస్తుంది.
ఈ క్రింది వాక్యము ఒక క్రొత్త మతాన్ని తీసుకురాదు, కాని మనస్ఫూర్తిగా వినువారందరికి లేక చదువు వారందరికి, వారు ఆకాంక్షించే ఔన్నత్యానికి నడిపించే సరియైన మార్గాన్ని కనుగొనుటకు దివిటీయై ఉండుటకు అది ఉద్దేశించబడింది.
తనను తాను చైతన్యపరచుకోనే వాడే ఆత్మీయంగా ముందుకు పోగలడు. అవివేకి, ఎవడైతే దానికొరకు ఇతరుల ద్వారా రూపొందించబడిన అభిప్రాయాలను సహాయసాధనాలుగా ఉపయోగిస్తాడో వాడు, ఒక ప్రక్క తన ఆరోగ్యవంతమైన అవయవాలు వాడుక లేకుండా ప్రక్కన ఉంచబడియుండగా, తన త్రోవపై ఊతకర్రలపై నడిచినట్లు మాత్రమే నడుస్తాడు.
కాని, అతడు తనయందు తన పిలుపుకై వేచియుంటూ నిద్రావస్థలోవున్న అన్ని సామర్థ్యాలను సాహసంతో ఒక కవచంవలే వాడిన వెంటనే తనకప్పగించిన సామర్థ్యతను తన సృష్టికర్త యొక్క చిత్తానుసారంగా అధిరోహణకై వినియోగిస్తాడు మరియు తనను మళ్ళిస్తూ తన త్రోవలో అడ్డురావాలనుకునే అన్ని అడ్డంకులను అవలీలగా దాటుతాడు.
అందువల్ల మేల్కొనండి! కేవలం నిర్ధారణలో మాత్రమే నిజమైన విశ్వాసం ఉన్నది, మరియు నిర్ధారణ విచక్షణలేకుండా సరితూచుట మరియు పరీక్షించుట ద్వారా మాత్రమే కలుగుతుంది! మీ దేవుని యొక్క అధ్భుతమైన సృష్టిలో సజీవులుగా ఉండండి!
అబ్ద్-రు-షిన్
ISBN | 978-3-87860-622-2 |
---|---|
రచయిత | అబ్ద్-రు-షిన్ |
పేజీల సంఖ్య | 251 |
భాష | తెలుగు |
డెలివరీ సమయం | జర్మనీ: 1-3 వ్యాపార రోజుల ఇతర దేశాలు: 5-30 పని రోజులు |